మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150 తో మరింత పాపులారిటీ దక్కించుకున్న చిరంజీవి.. సైరా నరసింహారెడ్డి సినిమాతో కూడా పరవాలేదనిపించుకున్నాడు. అయితే ఈయన నటించిన ఆచార్య సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది దీంతో ఎలాగైనా సరే విజయం సాధించాలని గాడ్ ఫాదర్ సినిమాతో రాగా.. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా రాబోతున్నారు


డైరెక్టర్ బాబి డైరెక్షన్లో ప్రముఖ బడా నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు పాటలు, టీజర్స్, పోస్టర్, గ్లింప్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి . ఇందులో చిరంజీవి పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ కూడా చిరంజీవికి సవతి సోదరుడుగా నటిస్తూ ఉండడం గమనార్హం . హీరోయిన్గా శృతిహాసన్ కూడా నటిస్తోంది.

ఇదిలా ఉండగా సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు? ఎక్కడ? నిర్వహించబోతున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. జనవరి 13వ తేదీన సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8వ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపించడానికి చిత్ర బృందం సన్నహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అన్ని పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా ఎవరు రానున్నారు అనేది సందేహంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: