యంగ్ హీరోయిన్ మాళవిక శర్మ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. మొదట 2018 లో నటుడు రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ తర్వాత హీరో రామ్ సరసన రెడి చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ అందంతో బాగానే ఆకట్టుకున్న సక్సెస్ మాత్రం దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం తమిళ్, బాలీవుడ్ వంటి చిత్రాలలో నటిస్తున్నది. గత ఏడాది కాఫీ విత్ కాదల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ పెడుతున్న ఈ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్ సరసన కీసిక భాయ్ కిసి కా జాన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత అక్కడ మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా సినిమాలలో అలరిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. ముఖ్యంగా తన ఎద అందాల విందు చేస్తూ వరుస ఫోటో షూట్ల తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మాళవికా శర్మ చీరకట్టులో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది.ఎర్రటి చీరలో తన ఒంపు సొంపులను ప్రదర్శించి స్లీవ్ లెస్ బ్లౌజులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరొకవైపు తను చూసే చూపులకు కొంటె పోజులకు కుర్రకారులు సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఉన్నారంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన మాలవిక శర్మ ఫొటోస్ అభిమానులు తెగ లైక్స్, కామెంట్లతో చాలా వైరల్ గా చేస్తున్నారు. మరి మాళవిక శర్మ టాలీవుడ్ లో ఈ ఏడాదైనా అదృష్టం కలిసి వచ్చి అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి. ప్రస్తుతం మాళవిక శర్మకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: