సినిమా ప్రేక్షకులు బయట నుంచి ఆహార పానీయాలను థియేటర్లోకి తీసుకురాకుండా నిషేధించే హక్కు సినిమా థియేటర్ల యాజమాన్యానికి ఉందని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహాలతో కూడిన ధర్మాసనం సినిమా హాల్ యజమాని యొక్క ప్రైవేట్ ఆస్తి అని... ప్రజాప్రయోజనాలకు లేదా భద్రతకు విరుద్ధం కానంతవరకు తనకు తగినట్లుగా భావించే నిబంధనలను, షరతులను విధించే స్వేచ్ఛ థియేటర్ యజమానికి ఉంటుందని నొక్కి చెప్పారు.

ఇకపోతే అన్ని సినిమా హాళ్లలో సినిమా ప్రేక్షకులందరికీ పరిశుభ్రమైన తాగునీటిని థియేటర్లలో ఉచితంగా అందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది . అంతేకాదు శిశువు లేదా బిడ్డ తల్లిదండ్రులతో పాటు వచ్చినప్పుడు వారికి సహితుకమైన ఆహారాన్ని థియేటర్లలో తీసుకెళ్లవచ్చు అని కూడా తెలిపింది. ఒక ప్రేక్షకుడు సినిమా థియేటర్లోకి ప్రవేశిస్తే థియేటర్ యజమాని యొక్క నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి..ఇది స్పష్టంగా వాణిజ్య నిర్ణయం అని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. మల్టీప్లెక్స్ లు మరియు సినిమా థియేటర్లు సినిమా ప్రేక్షకులు తమ సొంత ఆహారం మరియు పానీయాలను థియేటర్లలో తీసుకురావచ్చు అంటూ కాశ్మీర్ హైకోర్టు ఆదేశాలను ఇచ్చింది.  2018 నుంచి హైకోర్టు ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ థియేటర్ యజమానులు మరియు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన అప్పీలను సుప్రీంకోర్టు విచారించింది.

జమ్మూ కాశ్మీర్ రూపొందించిన నిబంధనల ప్రకారం సినిమా ప్రేక్షకులు తమ సొంత ఆహారం లేదా వాటర్ బాటిల్ ని హాల్లోకి తీసుకురావడం నిషేధించబడింది అని సుప్రీంకోర్టు తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.  అంతేకాదు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదిస్తూ సినిమా హాల్,  ఆవరణలో పబ్లిక్ ప్రాపర్టీ కాదు. అలాంటి హాల్లో అడ్మిషన్ సినిమా హాల్ యాజమాన్యానికి రిజర్వ్ చేయబడింది అని వాదించారు.  ఆహారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే అన్ని హాల్స్ లో పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉండేలా చూస్తామని కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: