మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి తాజాగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి వాల్తేరు వీరయ్య లో హీరో గా నటించాడు. అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... ఊర్వశి  రౌటేలా  ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించగా ... రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో బాబి సింహ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు నాలుగు పాటలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మరియు నాలుగు పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని యూఎస్ఏ లో జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ మూవీ యొక్క ఫ్రీ సేల్స్ కూడా యూఎస్ఏ లో మొదలు అయ్యాయి. ఈ మూవీ యొక్క ఫ్రీ సేల్స్ కు భారీ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే యూఎస్ఏ లో ఈ మూవీ ఫ్రీ సేల్స్ కు 100 కే కలెక్షన్స్ లభించాయి. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 5 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: