టాలీవుడ్ లో హీరో , హీరోయిన్ , కమెడియన్ . క్యారక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎవరు అయినా టాలెంట్ ఉండాలి కానీ ఎటువంటి సినీ నేపధ్యం లేకపోయినా అవకాశాలను ఈజీగా సంపాదించుకోవచ్చు. అయితే అందుకు మన శ్రమ ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ అలా ఒకటి రెండు అవకాశాలు వచ్చినా వాటిని సరిగా ఉపయోగించుకోలేక కెరీర్ ను పాడు చేసుకున్నవారు కూడా లేకపోలేదు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన ముద్దులొలికే తెలుగమ్మాయి పునర్నవి భూపాళం. ఈమె గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో అయితే ఉండరనే అనుకోవాలి. మొదటగా ఈమె ఉయ్యాలా జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసింది.

అందులో ఎవరూ ఈమెను పెద్దగా పట్టించుకోకపోయినా మాటీవీలో ప్రతియే సంవత్సరం టెలికాస్ట్ అయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ లో ఒక సీజన్ లో పునర్నవి కంటెస్టెంట్ గా వెళ్ళింది. అక్కడ హౌస్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపింది. ఇది భుశుంన ప్రేక్షకులు అందరికీ నచ్చడంతో పునర్నవికి బాగా పాపులారిటీ వచ్చేసింది. ఆ పాపులారిటీతోనే కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లలో ఆఫర్ లను అందుకుంది. కానీ తన కెరీర్ కు ప్లస్ అయ్యే సినిమాలు అయితే పడలేదు అని చెప్పాలి. అలా సినీ ప్రపంచానికి పునర్నవి దూరం అయిపోయింది. ఇక రోజువారీ జీవితంలో ప్రేక్షకులు కూడా ఆమెను మరిచిపోయారు.

తాజాగా పునర్నవి న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ప్రేక్షకులకు టచ్ లోకి వచ్చింది. తీరా చూస్తే న్యూ ఇయర్ లో తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పి బాధపెట్టింది. పిన్ను చెప్పిన వివరాల ప్రకారం ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటోందట. కనీసం కొత్త సంవత్సరంలో అయినా ఈమెకు ఈ సమస్య నుండి విముక్తి లభించాలని ఆమె అభిమానులు మరియు కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: