ఈసారి సంక్రాంతి పండుగకు అటు కోలీవుడ్ బడా హీరోలు , ఇటు టాలీవుడ్ బడా హీరోలు ఒకేసారి పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పోటీ పడడానికి సిద్ధంగా ఉండగా.. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో పోటీకి సై అంటున్నాడు. మరొకపక్క కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న భైలింగ్వల్ చిత్రం వారసుడు కూడా సంక్రాంతి పండగకు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తునివు సినిమా కూడా సంక్రాంతి పండుగకు విడుదల చేయడానికి ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. అయితే బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి , విజయ నటిస్తున్న వారసుడు సినిమాలు జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధం కానున్నాయి.


మరొకవైపు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా జనవరి 13వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో అజిత్ తునివు సినిమాను సోలోగా విడుదల చేయాలని.. అందుకే జనవరి 11వ తేదీన పక్క ప్లాన్ వేసి మరీ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది.  తెలుగులో ఈ సినిమాను తెగింపు పేరిట విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. హెచ్. వినోద్ దర్శకత్వంలో బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ నాచురల్ లుక్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను  టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  నైజాం,  వైజాగ్ ఏరియాలతోపాటు ప్రాధాన్యత ఉన్న థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు ఒకపక్క విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాకి కూడా ఈయనే నిర్మాత కావడం గమనార్హం. చిరంజీవి ,బాలకృష్ణ సినిమాలకు థియేటర్ లు  ఇవ్వకుండా విజయ్ వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్ లు కేటాయించడమే కాకుండా ఇప్పుడు తెగింపు సినిమాని కూడా ఇక్కడ రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు దీన్నిబట్టి చూస్తే కక్షపూరితంగానే చిరంజీవి , బాలకృష్ణకు థియేటర్ లు ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరి వీటిలో ఏవి విజయం సాధిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: