మిల్కీ బ్యూటీ తమన్న గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కరలేదు అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు  దశాబ్ద కాలం నుంచి కూడా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. తన తన అందం అభినయంతో  ఇప్పటికే కోట్ల మంది అభిమానులను సంపాదించింది అన్న విషయం తెలిసిందే. అంతే కాదు స్టార్ హీరోలు అందరితో జోడి కట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగులో హ్యాపీడేస్ అనే సినిమా ద్వారా ఫామ్ లోకి వచ్చిన తమన్నా ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. ఇంకా ఆ తర్వాత కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా మారిపోయింది.



 సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ నే ఎక్కువగా నమ్ముకున్న ఈ ముద్దుగుమ్మ సూపర్ సక్సెస్ అయింది అని చెప్పాలి. ఆ తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాక ఇక నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అని చెప్పాలి. ముఖ్యంగా బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు ఇక తమన్నాలో దాగివున్న నటిని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పరిచయం చేశాయి అని చెప్పాలి.  ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో మంది యువ హీరోయిన్లు సత్తా చాటుతూ  అదరగొడుతూ ఉన్నప్పటికీ తమన్నా క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు అని చెప్పాలి.


 సీనియర్ హీరోయిన్గా మారిన తర్వాత కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఏ రంగంలో అయినా మనం అనుకున్నది వెంటనే జరిగిపోదు అంటూ మిల్కీ బ్యూటీ చెబుతుంది. ఎవరైనా సరే ఒక టైం వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే. మనకు కూడా కెరియర్ ఆరంభంలో ఆశించిన అవకాశాలు లభించలేదు. వచ్చిన అవకాశాలలోనే నా ప్రతిభను చాటెందుకు ప్రయత్నించాను అంటూ చెప్పుకోవచ్చింది. తాను ఏం కావాలని అనుకున్నానో ఇప్పుడు దాన్ని సాధించాను. తన సినీ ప్రయాణం చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది అంటూ మిల్కీ బ్యూటీ తమన్న తెలిపింది. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు హీరోలతో సమానంగా మర్యాద లేదు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది తమన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: