నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా అఖండ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... ప్రగ్యా జైస్వాల్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది.

పూర్ణ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. తమన్మూవీ కి సంగీతం అందించగా ... ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డిమూవీ ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ 21 డిసెంబర్ 2021 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది.

ఇలా ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ మూవీ ని హిందీ లో కూడా విడుదల చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ని హిందీ భాషలో జనవరి 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అలాగే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన హిందీ ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ హిందీ ట్రైలర్ కు కూడా ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: