ఈసారి సంక్రాంతి పండుగకు సినిమాల సందడి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని పక్కన పెడితే పోటీ ఎలా ఉండబోతోంది అనే విషయమే ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగకు రెండు తెలుగు పెద్ద సినిమాలతో పాటు రెండు తమిళ్ పెద్ద సినిమాలు కూడా పోటీ పడబోతున్నాయి. అందులో ఒకటి బైలింగ్వల్ చిత్రం కూడా కావడం గమనార్హం. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే కోలీవుడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో హీరో అజిత్ నటిస్తున్న తునివు సినిమాను తెలుగులో తెగింపు పేరిట డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జనవరి 11వ తేదీన చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.


మరొకవైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న బై లింగ్వల్ చిత్రం వారసుడు సినిమాని కూడా తమిళ్లో వారిసు పేరిట జనవరి 12వ తేదీన రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రెండు సినిమాలతో పాటు బాలయ్య వీర సింహారెడ్డి , చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రాలు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు చిత్రాలతో పోల్చుకుంటే విజయ్ నటిస్తున్న వారసుడు చిత్రానికే ఎక్కువగా థియేటర్ లు లభించినట్లు సమాచారం. ఇకపోతే ఈ రెండు సినిమాల విడుదలకు ఇంకా పదిరోజుల సమయం ఉంది.

అయితే ముందుగానే విజయ్ వారిసు, అజిత్ తునివు సినిమా బుకింగ్స్ త్వరలోనే మొదలు కాబోతున్నాయి అని స్పష్టం అవుతుంది.  అసలు విషయంలోకి వెళితే ఇప్పుడు వచ్చే ఆదివారం నుంచి తమిళనాడులో ఈ రెండు సినిమాల ప్రీ బుకింగ్ ఓపెన్ కాబోతున్నాయి. రెండూ కూడా చాలా త్వరగా విడుదల చేయడం ద్వారా మంచి ప్రారంభాన్ని పొందాయి.  TNలోని అన్ని నగరాల్లో ఆదివారం నుండి బుకింగ్‌లు తెరవబడతాయి అని చిత్ర బృందం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: