టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యాక్షన్ హీరో గోపీచంద్ ఇద్దరూ ఎంత మంచి స్నేహితులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి తాజాగా బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్థాపబుల్ షో కి హాజరైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ ను ఆహా రెండు భాగాలుగా విడుదల చేసింది. అందులో పార్ట్ 1 న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైంది. ఇక ఈ ఎపిసోడ్లో ప్రభాస్ మాత్రమే కనిపించాడు. మొదటి ఎపిసోడ్ లో ప్రభాస్ బాలయ్య మధ్య జరిగిన సరదా సంభాషణ, రామ్ చరణ్ ఫోన్ కాల్ షోకే హైలెట్ గా నిలిచింది. ఇక తాజాగా సెకండ్ పార్ట్ ని విడుదల చేశారు. ఇక ఈ ఎపిసోడ్ కూడా చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా సాగింది.

గోపీచంద్ ప్రభాస్ ల దగ్గర నుంచి బాలయ్య చాలా విషయాలను రాబట్టాడు. ఈ క్రమంలోనే డార్లింగ్ ప్రభాస్ సిగరెట్ తాగుతాడనే విషయాన్ని రివీల్ చేశాడు గోపిచంద్. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..బాలకృష్ణ ప్రభాస్, గోపీచంద్ ఇద్దరినీ.. మీ ఇద్దరూ చిరాగ్గా ఉంటే ఏం చేస్తారు? అని అడిగాడు. అందుకు ప్రభాస్ ఆన్సర్ ఇస్తూ..' గోపీచంద్ కి అసలు చిరాకు, కోపం అనేది రాదని.. అతనికి ఓపిక అనేది చాలా ఎక్కువ అని.. ఎప్పుడు కూడా చాలా కూల్ గా మాట్లాడతాడని చెప్పాడు. ఆ తర్వాత గోపీచంద్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ కి కోపం వచ్చినా, చిరాకు వచ్చినా అందరిని వెళ్లిపోమంటాడు. పక్కన ఎవరూ కూడా ఉండొద్దంటాడు. మొత్తం అందరినీ గెటవుట్ అంటాడు.

ఆ తర్వాత ఒక్కడే వెళ్లి సిగరెట్ తాగుతాడని గోపీచంద్ చెప్పాడు. అయితే సిగరెట్ తాగుతాడు అనే విషయం గోపీచంద్ స్వయంగా చెప్పకుండా సింబల్ చూపించాడు. దీంతో నెటిజన్స్, ఫాన్స్ అందరు కూడా ప్రభాస్ సిగరెట్ తాగుతాడా?అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ప్రభాస్ దమ్ము కొడుతున్న ఎన్నో ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు గతంలో సాహూ ప్రమోషన్స్ కి ముంబై వెళ్ళినప్పుడు తన అసిస్టెంట్ కి సిగరెట్ ఇవ్వమని ప్రభాస్ సైగ చేసిన వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. మొత్తంగా ప్రభాస్ సిగరెట్ తాగుతాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్ గా మారుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: