ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి శెట్టి.ఈమె అందం, అభినయం, తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది ఈ ఉప్పెన బ్యూటీ.. ఈమె నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. దాని అనంతరం స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఇక నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యాంసింగ రాయ్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె అనంతరం  నాగచైతన్య హీరోగా నటించిన బంగారు రాజు సినిమాలో కూడా నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దాని అనంతరం వరస సినిమాల లో నటించింది కృతి శెట్టి దివారియర్, 

మాచర్ల నియోజకవర్గం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇలాంటి సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది కృతి శెట్టి. అయితే ప్రస్తుతం ఉప్పెన బ్యూటీ  చేతిలో వరుస ప్రాజెక్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ కృతి శెట్టి కథల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈమె మలయాళం లో  థామస్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. అంతేకాదు మరోవైపు కోలీవుడ్లో హీరో సూర్యతో కూడా

 ఒక సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నప్పటికీ... కొన్ని కారణాలవల్ల ఆ సినిమాలో నటించే అవకాశాన్ని మిస్సయింది కృతి శెట్టి. అయితే కొన్ని సినిమాలకి గాను ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తాము అన్నప్పటికీ కథ బాగుంటేనే సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటుందట కృతి శెట్టి. దీంతో చాలామంది... వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయిన నేపథ్యంలో కృతి శెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడం కారణంగానే కృతి శెట్టి లో ఇలాంటి మార్పు వచ్చింది అని కూడా అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: