టాలీవుడ్ లో హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జయం సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న సదా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. నార్త్ ప్రాంతానికి చెందిన సదా తెలుగులో సౌత్ చిత్రాలలోనే నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా హోమ్లీ హీరోయిన్గా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. జయం సినిమాతో పాటు అవునన్నా కాదన్న, అపరిచితుడు ,మైత్రి ,మోహిని వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత తమిళ్, కన్నడ ,మలయాళం వంటి సినిమాలలో నటించి దక్షిణాదిలో కూడా తన సత్తా చాటింది .2014లో విడుదలైన తెలుగు చిత్రం యమలీల స్పెషల్ అప్పీరెన్స్ గా ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఎలాంటి సినిమాలు కూడా నటించలేదు సదా తమిళంలో చివరిగా మాత్రం టార్చిలైట్ సినిమాలో నటించింది. దాదాపుగా సదా సినిమా విడుదల ఇప్పటికి కొన్ని సంవత్సరాలు పైనే కావస్తోంది దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారని చెప్పవచ్చు. దీంతో బుల్లితెర పైన షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉంటోంది సదా.సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గానే ఉంటూ తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సదా నటించిన హలో వరల్డ్ వెబ్ సిరీస్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టబోతోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ తన ఫోటో షూట్లతో మరొక సారి ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తుంది. అభిమానులు మాత్రం సదా వివాహం ఎప్పుడు జరుగుతుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి అంటెనే దాటివేస్తోంది. సదా తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటో షూట్ లలో సదా ఇచ్చిన స్టిల్స్ కు కొర్రకారుల సైతం ఫిదా అవుతున్నారు. దీంతో పలు రకాలుగా ఈ ఫోటోలు పైన కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: