టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ధమాకా. త్రినాద రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో యంగ్ హాట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.మంచి కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి మంచి సూపర్ హిట్ టాక్ మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా ఈ వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ మూవీ పెద్ద సూపర్ హిట్ గా నిలవడంతో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో మాస్ రాజా రవి తేజ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు..ఇక మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. చాలా అనందంగా వుందని అన్నారు . దర్శకుడు త్రినాథరావు ఇంకా రచయిత ప్రసన్నకి అభినందనలు తెలిపారు. శ్రీలీలకి కూడా కంగ్రాట్స్ చెప్పారు. ఇలాంటి కంగ్రాట్స్ ఇంక వింటూనే వుండాలని అన్నారు.


 సంగీత దర్శకుడు భీమ్స్ ఇలాగనే ఇరగదీసేయాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు ఇంకా వివేక్ కూచిభొట్ల గారికి బిగ్ కంగ్రాట్స్ చెప్పారు. ఎక్కడా రాజీపడకుండా చేసి చాలా చాలా పాజిటివ్ గా వుంటారని అన్నారు.వారు నెక్స్ట్ లెవల్ వెళ్తున్నారని ఇంకా మీడియాతో మెమెంటోలు ఇవ్వడం చాలా బావుందని అన్నారు. అలాగే మీడియాకి కృతజ్ఞతలు తెలిపారు. వంశీ శేఖర్ కి థాంక్స్ చెప్పి ఇంకా అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు రవితేజ.ఇక ఆ తర్వాత హీరోయిన్ కూడా శ్రీలీల మాట్లాడుతూ.. "రవితేజ గారు నాకు కెరీర్లోనే బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నా కెరీర్ బిగినింగ్ లో ఆయనతో పని చేసే అవకాశం రావడం ఇంకా ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది చాలా ఆనందంగా వుంది. రవితేజ గారు నాలో చాలా గొప్ప ఆత్మ విశ్వాసం నింపారు. రవితేజ గారు నిజంగా గొప్ప స్ఫూర్తి. ధమాకాని మాస్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు” అని అన్నారు శ్రీ లీల..

మరింత సమాచారం తెలుసుకోండి: