పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ లలో ఒకటి అయినటు వంటి ఖుషి మూవీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్ జె సూర్య దర్శకత్వం వహించగా ... భూమికా చావ్లా హీరోయిన్ గా నటించింది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ మూవీ ని పోయిన సంవత్సరం డిసెంబర్ 31 వ తేదీ నుండి కొన్ని రోజుల పాటు 4 కే వర్షన్ తో థియేటర్ లలో మళ్ళీ విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


రీ రిలీజ్ లో భాగంగా ఖుషి 4 కే వర్షన్ కు నైజాం ఏరియాలో 2.70 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. సీడెడ్ ఏరియాలో 80 లక్షల కలెక్షన్ లు దక్కగా ,  ఆంధ్ర ఏరియాలో 2.80 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 6.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియాలో 66 లక్షలు ,  ఓవర్సీస్ లో 34 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమా 4 కే వర్షన్ రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 7.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ కలెక్షన్ లను బట్టి చూస్తే ఖుషి మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చినట్టే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: