తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ ఆఖరుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ యువ హీరో తాజాగా అనిల్ కుమార్ అల్ల దర్శకత్వంలో రూపొందిన కళ్యాణం కమనీయం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క వెడ్డింగ్ థీమ్ సాంగ్ ను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 07  నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ... ఆ సాంగ్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: