చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ అతడు ఏదైనా ఒక విషయం పై స్పందిస్తే ఆవిషయం పై రాజకీయ కోణంలో చర్చలు జరగడం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. చిరంజీవి అనేకసార్లు పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ తమ దారులు వేరైనా గమ్యం ఒక్కటే అని ఓపెన్ గానే చెప్పాడు.

 

 
ఇప్పుడు చిరంజీవి ఉత్తరాంద్ర ప్రాంతానికి కీలక నగరమే కాకుండా అన్నీ కలిసివస్తే ఆంధ్రప్రదేశ్ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మారే అవకాశం ఉన్న విశాఖపట్నం దగ్గరలోని భీమ్లీ ప్రాంతంలో చిరంజీవి ఒక భారీ ఇల్లు కట్టుకోవడం వెనుక రాజకీయం ఉందా అంటూ కొందరు అప్పుడే విశ్లేషణలు మొదలుపెట్టేసారు. ఆంధ్రప్రదేశ్ లో మరొక సంవత్సర కాలంలో జరగబోయే ఎన్నికలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి అత్యంత కీలకం.

 

 ఉత్తరాంద్ర ప్రాంతంలో చిరంజీవికి విపరీతమైన అభిమానులు ఉండటమే కాకుండా అతడి అభిమాన సంఘాలు కూడ ఉత్తరాంద్రలో చాల ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన ప్రజానీకం కూడ ఉత్తరాంద్రలో చాల ఎక్కువమంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో తన అభిమాన సంఘాలకు అదేవిధంగా తన సామాజిక వర్గ ప్రజలకు తాను వైజాగ్ లో సెటిల్ కాబోతున్న విషయాన్ని ముందుగా తెలియచేసి వారి అభిమానాన్ని పొందడమే కాకుండా ఆఅభిమానం ఓట్ల రూపంగా రానున్న ఎన్నికలలో మారగలిగితే పవన్ ‘జనసేన’ కు లాభం చేకూరుతుంది అన్న ఎత్తుగడ చిరంజీవి భీమ్లీ ప్రాంతంలో కట్టుకోబోయే ఇంటి విషయంలో ఉన్నాయి అంటూ అప్పుడే రాజకీయ విశ్లేషణలు మొదలైపోయాయి.

 

 ఇది ఇలా ఉండగా ఆమధ్య చిరంజీవి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన తమ్ముడు పవన్ సలహాలు అడిగితే తాను సలహాలు ఇవ్వడానికి రెడీ అంటూ చెప్పిన మాటలు ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో చిరంజీవి కట్టుకోబోయే ఇల్లు ఇలా అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉండటం అత్యంత ఆసక్తిదాయకంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: