తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో పేపర్ బాయ్ మూవీ తో హీరోగా మంచి గుర్తింపును దక్కించుకొని ... ఆ తర్వాత ఏక్ మినీ కథ మూవీ తో ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి నటుడిగా ప్రశంసలను అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ యువ హీరో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఫరీయ అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సంతోష్ "కళ్యాణం కమనీయం" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యువి క్రియేషన్ సంస్థ నిర్మించగా ... ప్రియ భవాని శంకర్మూవీ లో హీరోయిన్ గా నటించింది. అనిల్ కుమార్ అల్లా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా ... వాటికి మంచి ఆదరణ ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీకి "యు" సర్టిఫికెట్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ కేవలం ఒక గంట 46 నిమిషాల క్రేజీ రన్ టైమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: