
బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
బాలకృష్ణ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన రూలర్ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 23.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సోనాల్ చౌహన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.
బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ ని సొంతగా రిలీజ్ చేసుకున్నారు.
ఎన్టీఆర్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 70.58 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.