ఇతర వ్యక్తులు ఏం చేసినా కూడా వారిని బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలను అయితే అస్సలు వదలరు.

వారు ఏ మంచి పని చేసినా కూడా మరో కోణంలో చూస్తూ వారిని ట్రోల్స్ చేస్తుంటారు. అసలు ఏ కోణంలో వీళ్ళు ఆలోచిస్తారో తెలియదు కానీ టార్గెట్ చేస్తే అస్సలు వదలరు. ఇక ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో సెలబ్రెటీలకు, సామాన్యులకు మధ్య కమ్యూనికేషన్ చాలా దగ్గర్లో ఉంది.

దీంతో వెంటనే సోషల్ మీడియా లో ఆడుకుంటున్నారు కొందరు జనాలు. సెలబ్రెటీలు తాము ఏ విషయం పంచుకున్నా కూడా అస్సలు వదలట్లేదు. ఏదో ఒక కామెంట్ చేస్తూ వాళ్ళని బాగా అవమానిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సామాన్యులు సెలబ్రెటీలను బాగా టార్గెట్ చేసి చాలా నెగటివ్ కామెంట్లు ను చేశారు. అయితే కొందరు వీరి నుంచి వచ్చే కామెంట్లను మాత్రం అస్సలు పట్టించుకోరు. అయితే తాజాగా కాజల్ కూడా ఒక వీడియో పంచుకోగా ఓ నెటిజన్ మరో కోణం లో తనకు నెగటివ్ గా కామెంట్ ను చేశారు. ఇంతకూ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే అయితే లేదు. తెలుగు ప్రేక్షకుల మనస్సు లో మంచి హీరోయిన్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ చాలా వరకు మంచి మంచి సినిమాలలో నటించి మంచి పేరు ను కూడా సంపాదించుకుంది. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.కాజల్. మధ్యలో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోగా మళ్లీ రీఎంట్రీ ను ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ.

మంచి హోదాలో ఉన్న సమయంలో కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడైన బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లూ ను ప్రేమించి వివాహం చేసుకుందని పెళ్లి తర్వాత కూడా తన భర్త సపోర్టుతో పలు సినిమాల్లో కూడా నటించింది. అంతేకాకుండా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాల్లో కూడా మంచి అవకాశం అందుకుంది. కానీ ఆ సమయంలో తను ప్రెగ్నెంట్ కావడంతో ఆ సినిమాను వదులుకోవలసి వచ్చింది.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ముద్దుగుమ్మ తన అభిమానులకు తీపి కబురు ను చెప్పింది. అలా ఆ మధ్యనే పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో కాజల్ ఇక సినిమాలలో నటించేదేమో అని వార్తలు జోరుగా వచ్చాయి. కానీ తను మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆ మధ్యనే తనకు ఓ సినిమాలో అవకాశం కూడా వచ్చినట్లు కూడా తెలిసింది.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం బాగా పోస్ట్ లు ను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది. ప్రస్తుతం ఖాళీగా ఉండకుండా పలు యాడ్స్ కూడా చేస్తుంది. అయితే తాజాగా ఒక యాడ్ కు సంబంధించిన వీడియో ఆమె పంచుకుంది. నిజానికి అందులో ఎటువంటి తప్పు లేదు కానీ ఓ నెటిజన్ మాత్రం తప్పుగా అర్ధం చేసుకొని.. ఎందుకండి ఈ బతుకు అంటూ నెగటివ్ గా కామెంట్ చేయగా.. వెంటనే కాజల్ అభిమానులు ఆ నెటిజన్ పై తెగ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: