చిరంజీవి నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సాధిస్తున్న విజయాలను చూసి తండ్రిగా చిరంజీవి ఎంతో గర్విస్తూ ఉంటాడు. రామ్ చరణ్ ఖ్యాతి బాలీవుడ్ ను దాటి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ స్థాయికి ఎదగడంతో చిరంజీవి అందుకోలేకపోయిన అనేక విజయాలను చరణ్ అందుకుంటూ ఉన్న నేపధ్యంలో చిరంజీవి చాల జోష్ లో ఉన్నాడు.


సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘వాల్తేర్ వీరయ్య’ ప్రమోట్ చేస్తూ చిరంజీవి చరణ్ తో తనకు గల బంధం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. చరణ్ చిన్నతనంలో తాను చాల బిజీగా ఉండటంతో కనీసం ఎప్పుడు చరణ్ తో సరదాగా కాలం గడపలేదు అన్న బాధ తనకెప్పుడు ఉంటుందని కామెంట్ చేసాడు. తాను షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చే సమయానికి చరణ్ పడుకుని ఉండేవాడని చెపుతూ ఆసమయంలో అతడిని లేపడం ఇష్టంలేక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.


ఇప్పుడు తనకంటే చరణ్ మరింత బిజీగా మారిపోయాడు అని అంటూ మరింత చిరంజీవి బాధపడ్డాడు. ఈమధ్య చరణ్ జపాన్ వెళ్ళాడని ఆతరువాత టాంజానియా వెళ్ళాడని అక్కడి నుంచి వచ్చి కేవలం తనతో రెండు రోజులు ఉండి అమెరికా వెళ్లిపోవడంతో తాను చరణ్ ను కలిసిన సందర్భాలు చాల తక్కువ అయిపోతున్నాయి అంటూ మరింత భావోద్వేగానికి చిరంజీవి లోనయ్యాడు.


అయితే త్వరలో చరణ్ తండ్రి కాబోతున్న నేపధ్యంలో తన మనవడితో తాను సరదాగా గడపాలని చరణ్ ఉపాసనలు త్వరలో మళ్ళీ తన ఇంటికి వచ్చేస్తున్నారని వారికోసం తన ఇంటి పై ఫ్లోర్ ను వారి అభిరుచులకు తగ్గట్లుగా మార్పులు చేస్తున్న విషయాన్ని తెలియచేసాడు. మళ్ళీ తాను తన కొడుకు చరణ్ తో కలిసి డిన్నర్ చేసే రోజులు అదేవిధంగా తన మనవడితో ఆడుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి అంటూ చిరంజీవి చరణ్ ఎదుగుదల చూసి తెగ సంబరపడుతున్నాడు..




 

మరింత సమాచారం తెలుసుకోండి: