టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కినేని వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకి పోటీగా నిలుస్తున్నాడు అక్కినేని నాగార్జున. తన కొడుకులైన అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ కూడా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ కొడుకుల కంటే తండ్రి స్టార్ హీరోగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. కొడుకులకు ఏమాత్రం తగ్గని అందంతో దూసుకుపోతున్నాడు అక్కినేని నాగార్జున. 

అయితే నాగార్జున వెంకటేష్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే .అయితే పెళ్లికి ముందు అక్కినేని నాగార్జున మరియు వెంకటేష్ చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇక నాగార్జున ఎప్పుడు వెంకటేష్ ని ఒరేయ్ అని పిలిచేవాడు. అనంతరం వెంకటేష్ సోదరి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. ఇక పెళ్లిలో కలిసి వీరిద్దరూ డాన్స్ కూడా వేయడం జరిగింది. అయితే నాగచైతన్య పుట్టిన తర్వాత వీరిద్దరూ ఒకరినొకరు  అరేయ్ ఒరేయ్ అని పిలుచుకునేవారు. దీంతో వీరిద్దరి మధ్య ఎంతటి మంచి అనుబంధం ఉందో తెలుస్తుంది.అయితే ఎవరు ఊహించని విధంగా నాగార్జున లక్ష్మి కి విడాకులు ఇవ్వడం జరిగింది.

ఇక అప్పటినుండి వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు. ఇక వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు ఉన్నాయని నాగార్జున లక్ష్మి కి విడాకులు ఇవ్వడంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అన్న వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అక్కినేని నాగార్జున లక్ష్మి కి విడాకులు ఇవ్వడంతో వెంకటేష్ హృదయం విరిగింది అని గతంలో వార్తలు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పటికీ వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం నాగార్జున బంగారు రాజు దయ్యం వంటి  సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక వెంకటేష్ సినిమాల విషయానికొస్తే ఇటీవల ఎఫ్ త్రీ సినిమాతో అందరినీ అలరించాడు.ఇక ప్రస్తుతం వెంకటేష్ తన మేనల్లుడు రానాతో కలిసి రాణానాయుడు అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: