టాలీవుడ్ లో కుర్ర హీరోయిన్ గా నేహా శెట్టి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నేటిజెన్లను మైమరిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర కట్టులో దర్శనమిచ్చిన కొన్ని ఫోటోలు కుర్రకారులను సైతం ఉక్కిరిబిక్కిరి చేసేలా కనిపిస్తున్నాయి. నేహా శెట్టి చివరిగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం గా డీజే టిల్లు తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో నేహా శెట్టి కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
మరొకవైపు సినిమాలలో అద్భుతమైన  నటనను ప్రదర్శించి ఆడియన్స్ చేత ప్రశంసల వర్షం అందుకుంది.  అలాగే గ్లామర్ ట్రీట్ తో కూడా వెండితెర పైన ఈ ముద్దుగుమ్మ తెగ సందడి చేసింది . ప్రస్తుతం తన రాబోయే చిత్రాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది.  ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లోనే ఉంటూ బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లతో అదరగొట్టేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నేహా శెట్టి చీరకట్టులో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. క్రీం కలర్  చీరలో స్లీవ్ లెస్ బ్లౌజు ధరించి .. అందాలను ఆరబోస్తూ తన కళ్ళతో మత్తుచూపులు చూస్తూ కుర్రకారుల గుండెల్ని పిండేస్తోంది నేహా శెట్టి.
తాజాగా ఈ ఫోటోలకు నేటిజన్లో ఫిదా అవుతూ సాంప్రదాయమైన దుస్తులలో మైమరిపించేలా చేస్తున్నావు నేహా అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్. ఇక నేహా శెట్టి తదుపరి చిత్రం విషయానికి వస్తే బెదురులంక 2012 అనే సినిమాతో రాబోతోంది ఈ.  సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించి ఇటీవలే ఒక అప్డేట్ కూడా విడుదల కావడం జరిగింది. దీంతో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కూడా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేహా కి సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: