మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం చివరగా ధమాకా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా  నటించింది . ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ ధమాకా మూవీ పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ లభించింది. దానితో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. దానితో అతి తక్కువ రోజుల్లోనే ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టి పోయిన సంవత్సరం మంచి విజయాల లిస్ట్ లో చేరి పోయింది.

ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శించ బడుతున్న సమయం లోనే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన సినిమాలను ఎక్కువ శాతం థియేటర్ లలో ప్రదర్శించడం వలన ధమాకా మూవీ ని చాలా థియేటర్ ల నుంచి తీసివేశారు. అయినప్పటికీ ధమాకా మూవీ ప్రదర్శించబడుతున్న అతి తక్కువ థియేటర్ లలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మేరకు ఫుల్ అయ్యాయి. దానితో ధమాకా మూవీ కి కనక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని థియేటర్ లు ఎక్కువగా ఇచ్చి ఉంటే అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టేది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: