పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం భీమ్లా నాయక్ మూవీతో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇలా భీమ్లా నాయక్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

నిధి అగర్వాల్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటిస్తూ ఉండగా , క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఈ సినిమా షూటింగుకు కూడా సమయాన్ని కేటాయిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులపాటు ఆగిపోయి మళ్ళీ తిరిగి ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రకరించింది.

ఈ యాక్షన్స్ సన్నివేశాల కోసం ఈ మూవీ యూనిట్ భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం జనవరి 26 వ తేదీన ఈ మూవీ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ సినిమా టీజర్ ను జనవరి 26 వ తేదీన విడుదల చేసే అవకాశం లేదు అంటూ ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: