నందమూరి మెగా కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికితోడు కొన్ని దశాబ్దాలుగా బాలకృష్ణ చిరంజీవి సినిమాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా సంక్రాంతికి కూడ చిరంజీవి బాలకృష్ణ సినిమాల వార్ కొనసాగుతూనే ఉంది. అదే కుటుంబాలకు చెందిన యంగ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల సినిమాల మధ్య పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య కొనసాగుతున్న స్నేహ బంధం ఇండస్ట్రీకి హాట్ టాపిక్ గా మారింది.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా నటించడానికి వీరి స్నేహబంధం మరింత సహకరించింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈమూవీలో వీరిద్దరూ కలిసి నటించిన ‘నాటు నాటు’ పాటకు అంతర్జాతీయ గుర్తింపు రావడంతో వీరిద్దరి స్నేహబంధం మరింత బలపడింది.


ఈమధ్య రాజమౌళితో కలిసి వీరిద్దరూ అమెరికా వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ చరణ్ లు తమ మధ్య కొనసాగుతున్న స్నేహ బంధం పై స్పందించారు. మూడేళ్లనుంచి తమ మధ్య ఉన్న పోటీని శతృత్వం అన్న పదంతో కొందరు వార్తలు వ్రాస్తున్నారని అలాంటి వార్తలు విని తమకు బోర్ కొట్టి తాము స్నేహాన్ని ఎంచుకున్నాము అంటూ చరణ్ కామెంట్ చేసాడు.



అయితే ఈవిషయమై జూనియర్ వేరే విధంగా స్పందిస్తూ తమ మధ్య ఉన్న స్నేహానికి ఫిజిక్స్ తో సంబంధం ఉంది అంటున్నారు. భిన్న ధృవాలు ఆకర్షించుకున్నట్టుగా తామిద్దరం ఒకరికొకరు ఆకర్షితులు అయ్యామని టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ ప్రాక్టీస్ సెషన్ లో ఆ బంధం బలపడింది అంటున్నాడు. “చరణ్ తనలో లేనివాటికోసం నాతో కలిశాడు, నాకు ఏం కావాలనుకుంటున్నానో అది చరణ్ నుంచి నేను పొందాను” అంటూ జూనియర్ వ్యూహాత్మకంగా కామెంట్ చేసాడు. శతృత్వం లేని ప్రేమ తమ మధ్య ఉంది అంటూ జూనియర్ చరణ్ లు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: