
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కు ఎంపికయ్యే లిస్ట్ లో ఉంది. అందుకోసం జక్కన్న , ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఒక కార్యక్రమంలో అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్ ను కలిసిన రాజమౌళికి ప్రసంశలు మరియు దిగ్గజ దర్శకుడి నుండి బంపర్ ఆఫర్ దక్కింది. జేమ్స్ కామెరూన్ తన సినిమాలను పొగడడమే కాకుండా .. హాలీవుడ్ లో సినిమా చేసే ఆలోచన ఉంటే నన్ను రండి నేను సపోర్ట్ చేస్తాను అని భరోసా ఇచ్చారట. ఇక కామెరూన్ సతీమణి సైతం రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసిందట.
ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. జక్కన్న ఫ్యాన్స్ కూడా హాలీవుడ్ లో సినిమా తీసి అక్కడ కూడా తెలుగోడి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ జక్కన్న అంత ఈజీగా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడడు. మరి భవిష్యత్తులో ఏమైనా హాలీవుడ్ లో సినిమా తీసే విషయాన్ని ఆలోచిస్తాడా ? అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.