
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంటకు 22 సంవత్సరాలు పూర్తవుతుంది.కానీ ఇప్పుడు ఈ జంట అర్ధాంతరంగా విడాకులు తీసుకోబోతున్నారని కోలీవుడ్ లో అసత్య ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా విజయ్.. సంగీతలో వచ్చిన మార్పు కారణంగా ఈ రూమర్స్ వస్తున్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ వారీసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంగీత రాలేదు.. అంతకుముందు డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా సీమంతం వేడుకలకు కూడా ఆమె హాజరు కాలేదు. అయితే ఇలా వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ అని తెలుస్తోంది.
కీర్తి సురేష్, విజయ్ ఇద్దరు కలిసి సర్కార్, బైరవ సినిమాలలో నటించారు ఆ కారణంగానే వీరిద్దరి మధ్య సన్నిహితం ఏర్పడింది. ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయ్ దళపతి 67 లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్గా ఎంపిక అయింది. దీంతో ఈ వార్తలు మరింత వైరల్ అవుతుండగా కీర్తితో దూరంగా ఉండాలని విజయ్ కి చాలాసార్లు సంగీత చెప్పిందట. కానీ అతను వినిపించు కోకపోవడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు అందుకే విడాకులు తీసుకోబోతున్నారని సమాచారం. మరి ఈ విషయంపై అసలు విషయం తెలియాలి అంటే ఎవరో ఒకరు స్పందించాలి.