మొదట లక్ష్మి కళ్యాణం చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. ఇక ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు మగధీర ,ఆర్య 2, నాయక్, బిజినెస్ మాన్ తదితర చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది కాజల్. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ ,హిందీ వంటి చిత్రాలలో కూడా కాజల్ నటించింది. అయితే 2020 వ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది .ఆ తర్వాత నుంచి కాస్త సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. గత సంవత్సరం ఏప్రిల్ 19న ఒక పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది.


ఇన్ని రోజులపాటు తన కుమారుడితో హాయిగా గడిపిన కాజల్ ఇప్పుడిప్పుడే తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయం చెప్పేందుకే సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న NBK -108 చిత్రం కోసం కాజల్ అగర్వాల్ ని సంప్రదించినట్లుగా సమాచారం. అయితే ఈ సినిమాకు ఇంకా కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.


ఈ చిత్రంలో శ్రీ లీల కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈమె తల్లి పాత్రలోనే కాజల్ అగర్వాల్ తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సంగీతాన్ని మాత్రం తమన్ అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ జరిగిన విషయం తెలిసింది తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. మొదటిసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నారు. మరి ఈ సినిమాలో శ్రిలీల తల్లి పాత్రలో కాజల్ నటిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: