తెలుగులో మేఘా ఆకాష్  గురించి అందరికీ తెలుసు.ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మరియు హిందీ భాషలో కూడా నటించింది.మేఘా తొలిసారిగా లై సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత చల్ మోహన్ రంగ మరియు రాజా రాజా చోరా సినిమాల్లో కూడా బాగా నటించింది. ఇక ఈ సినిమాలలో తన పాత్రకు మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.. ఇక తమిళంలో కూడా ఎక్కువ సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఇతర భాషలలో బాగా అవకాశాలు అందుకుంటుంది.గతంలో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు లేకపోయేసరికి కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి బ్రేక్ కూడా ఇచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి కొంతకాలం గ్యాప్ తో వచ్చిన మేఘా.. ఆ సమయంలో కోలీవుడ్ లో అడుగుపెట్టి మంచి అవకాశాలు అయితే అందుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడంతో రెండు వైపులా కూడా బిజీగా మారింది. నిజానికి కెరీర్ మొదట్లో ఈ ముద్దుగుమ్మ అంత విజయం అందుకోకపోగా.. ఇప్పుడు రానున్న సినిమాలతో ఎటువంటి విజయం అందుకుంటుందో చూడాలి.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతగానో యాక్టివ్ గా కనిపిస్తుంది. తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తుంది.సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా వుంది.చాలా వరకు ఫోటోషూట్లతో బాగా బిజీగా ఉంటుంది. నేచరల్ గా కనిపించిన మేఘా ఆకాష్ ఇప్పుడు అవకాశాల కోసం తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది. తన అందాల దృష్టి దర్శక నిర్మాతలపై పడాలి అని గ్లామర్ అందాలను కూడా బయటపెడుతుంది. నిజానికి ఈ బ్యూటీ అందంగా ఉన్నప్పటికీ కూడా టాలీవుడ్ లో మాత్రం చిన్న చిన్న సినిమాలలోనే అవకాశాలు వస్తున్నాయి.చిన్న హీరోలతోనే ఆమె నటించాల్సి వస్తుంది. ఈమధ్య కొత్త హీరోయిన్లు రావటంతో ఈ బ్యూటీ ని పట్టించుకోవడం మానేశారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా రెండు ఫోటోలను ఆమె పంచుకుంది. అందులో ఈ బ్యూటీ తన హాట్ అందాలతో ఫిదా చేసింది. ఆ ఫోటోలను చూసిన కుర్రాళ్ళు కూడా తన అందానికి బాగా ఫిదా అవుతున్నారు. చాలా అందంగా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నారని సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: