‘బొమ్మరిల్లు’ మూవీ విడుదలైన తరువాత సిద్ధార్థ్ మ్యానియా విపరీతంగా పెరిగిపోవడంతో అతడు టాప్ యంగ్ హీరోల లిస్టులో చేరిపోతాడని అప్పట్లో అందరు భావించారు. ఆతరువాత అతడికి కొన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చినప్పటికీ ఆతరువాత అతడు తన హిట్స్ ను కొనసాగించలేకపోయాడు. ఈమధ్య వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న ఈహీరో ఆమధ్య నటించిన ‘మహాసముద్రం’ మూవీపై చాలఆశలు పెట్టుకున్నాడు.

 

 ఆమూవీ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో సిద్ధార్థ్ ఆశలు అన్నీ తిరగబడ్డాయి. ఆమూవీ ఫ్లాప్ అయినప్పటికీ సిద్ధార్థ్ కు మంచితోడు దొరికింది అంటూ కొందరు షోషల్ మీడియాలో జోక్ చేస్తున్నారు. దీనికికారణం ఈమూవీలో హీరోయిన్ గా నటించిన అదతి రావ్ హైదరి తో అతడికి మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని ఆసాన్నిహిత్యం ఇప్పుడు ప్రేమగా మారిందని వార్తలు వస్తున్నాయి. హిందీ తమిళ తెలుగు సినిమాలలో నటించిన అదితి రావ్ హైదరి తల్లితండ్రులు ఒకప్రముఖ సంస్థానానికి చెందినవారు.

 
అయితే అదితి రావ్ కు సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆమె నటిగా స్థిరపడటానికి ఎన్నోప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయవంతం కాకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రావడంలేదు. ప్రముఖదర్శకుడు మణిరత్నం సినిమాలలో ఆమెకు అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె లీడింగ్ హీరోయిన్ గా ఇప్పటికీ స్థిరపడలేకపోతోంది. ఇలాంటి పరిస్థితులలో ‘మహాసముద్రం’ మూవీలో నటించిన రోజులనుండి వీరు మంచి స్నేహితులుగా మారడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆవార్తలను వారిద్దరూ ఖండించకపోవడంతో వీరిద్దరూ త్వరలో పెళ్ళి చేసుకుంటారు అన్నవార్తలకు మరింత ఊపు వచ్చింది.

 సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సిద్దార్థ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పై అదేవిధంగా సామాజిక పరిస్థితులపై తరుచూ స్పందిస్తూ ఉంటాడు. మంచి నటుడే అయినప్పటికీ అతడికి అవకాశాలు రాకపోవడం వెనుక అనేకకారణాలు ఉన్నాయి అని అంటారు. గతంలో సమంతను ప్రేమించి పెళ్ళి వరకు వస్తుంది అనుకున్న ఆప్రేమ బ్రేకప్ అవ్వడంతో ఇప్పుడు అదితి రావ్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరూ శర్వానంద్ ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కు వచ్చి చాల సన్నిహితంగా కనిపించడంతో మీడియా కెమెరాల దృష్టి అంతా వారిద్దరి పైనే పడి మళ్ళీ వార్తలకు వారిద్దరు హాట్ టాపిక్ గా మారారు..


మరింత సమాచారం తెలుసుకోండి: