గుజరాతి మూవీ ‘చెలో షో’ ఇండియా నుండి ఆస్కార్ అవార్డ్స్ ఉత్తమ చిత్ర నామినేషన్ కు అర్హత ఉంది అంటూ భారత ప్రభుత్వం అధికారికంగా ఈమూవీ ఎంట్రీని ఆస్కార్ అవార్డు ప్యానల్ కు పంపడంతో ఈమూవీకి ఆస్కార్ అవార్డ్ వచ్చే అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే అనూహ్యంగా రాజమౌళి చాకచక్యంతో తన ‘ఆర్ ఆర్ ఆర్’ ను ఆస్కార్ అవార్డ్స్ ప్యానల్ దృష్టి వరకు తీసుకువెళ్ళి విషయంలో చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రమోట్ చేయడంతో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్స్ ప్యానల్ లో చోటు దక్కింది కానీ ‘చలో షో’ కు ఎలాంటి కేతగిరిలోను స్థానం దక్కలేదు.


దీనితో ఈమూవీ దర్శకుడు పాన్ నళిన్ స్పందన ఎలా ఉంటుంది అన్న విషయమై అందరిలోనూ ఆశక్తి పెరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా అతడు నుండి వచ్చిన ప్రకటన చూసి అందరు షాక్ అయ్యారు. ‘ఇదే మా చివరి చిత్రం కాదు’ ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయగల సత్తా తనకు ఉంది అంటూ అతడు చేసిన ప్రకటన చాల హుందాగా ఉంది అంటూ ప్రశంసలు లభిస్తున్నాయి.


అంతేకాదు పాన్ నళిన్ ఈసారి ఆస్కార్ అవార్డ్ ప్యానల్ కు ఎంపిక అయిన అన్ని చిత్రాలకు తన అభినందనలు తెలియచేయడంతో అతడి వ్యక్తిత్వం తెలుస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆస్కార్ అవార్డు ప్యానల్ కు నామినేట్ కాలేదని బాధ పడుతున్న తన యూనిట్ కు ప్రోత్సహిస్తూ `హే మై లాస్ట్ ఫిల్మ్ షో ఫ్యామిలీ సంతోషించండి ముందుకు సాగుదాం. ఒక బృందంగా మీరు చాలా అద్భుతంగా పని చేసారు. మీరంతా తుఫానుల సమయంలో మంచి హృదయంతో మా కథకు అండగా నిలిచారు మనకు ఎటువంటి హైప్ లేదు. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మలను ఘాడంగా కదిలించారు’ అంటూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.



ఈమూవీ గత సంవత్సరం అక్టోబర్ 14న విడుదలైంది. 44వ మిల్ వ్యాలీ ఫిల్మ్ ఫెస్టివల్ లోని వరల్డ్ సినిమా విభాగంలో ప్రేక్షకుల ఉత్తమ వీక్షణ అవార్డును దక్కించుకుంది. 66వ వల్లాడోలిడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ చిత్రంగా గోల్డెన్ స్పైక్ అవార్డు ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: