ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ల హవా ఎంతలా నడుస్తూ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ, క్రీడా, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగా ఇక సినిమాలను తెరకేక్కిస్తూ  ఎంతో మంది ప్రేక్షకులకు తెలియని విషయాలను సినిమాల ద్వారా తెలియజేస్తూ సూపర్ హిట్లు అందుకుంటున్నారు దర్శక నిర్మాతలు. దీంతో ఇక ఇలాంటి బయోపిక్ ఏదైనా తెరకెక్కుతుంది అంటే చాలు ఇక ఆ సినిమాను చూడడానికి ప్రేక్షకులు కూడా తరలి వెళ్తూ ఉన్నారు అని చెప్పాలి.


 గతంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి సినిమా ఎంత సూపర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఇలాంటి ఓ సీనియర్ హీరోయిన్ కి సంబంధించిన బయోపిక్ తెరకెక్కిపోతుంది అన్నది తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న జమున. ఇటీవల అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు అన్న విషయం తెలిసిందే. దాదాపు 200 పైగా సినిమాల్లో తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో నటించారు ఆమె.


 ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా సత్యభామ పాత్రలో జమునను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా పాత్రలో ఒదిగిపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవలే జమున మరణించిన తర్వాత ఆమె బయోపిక్ విషయంలో అనేక వార్తలు తెరమీదికి వచ్చి వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే మరికొన్ని నెలల్లో ఆమె బయోపిక్ పట్టాలెక్కపోతుంది అంటూ ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మహానటి సావిత్రి బయోపిక్ కి ఆదరణ లభించినట్లుగానే జమున బయోపిక్ కూడా ఆదరణ లభిస్తుందని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట.


 ముఖ్యంగా ఈమె సినీ కెరియర్ లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సహా మరి కొంతమందికి హీరోలతో ఎదుర్కొన్న వివాదాలు.. ఇక సినిమాకు హైలైట్ గా మారుతాయి అని భావిస్తూ ఉన్నారట. ఈ క్రమంలోనే జమున బయోపిక్ తెరకెక్కించాలని అనుకుంటూ ఉండగా ఆమె పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్న అయితే బాగుంటుందని  అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అన్నది అధికారిక ప్రకటన వచ్చేంతవరకు తెలియదు అని చెప్పాలి. కానీ కోలీవుడ్ కు చెందిన  ప్రముఖ నిర్మాణ సంస్థ ఇక తమన్నాతో ఈ సినిమాను తెలకెక్కించాలని చూస్తున్నట్లు టాక్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: