తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సదా అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది. జయం సినిమాలో అద్భుతమైన నటనను ప్రదర్శించి కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. అలా ఎంతోమంది హీరోలతో నటించిన సదా అనుకోకుండా సినిమాలకు హీరోయిన్గా దూరమైంది.కానీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక హీరో హీరోయిన్స్ కి అక్క వదిన పాత్రలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుల్లితెర పైన పలు షోలలో సందడి చేస్తూ ఉంటుంది ఇటీవల స్టార్ మా లో బిబి జోడి పేరుతో ఒక షో మొదలయ్యింది.ఇందులో సీనియర్ హీరోయిన్ రాధా, సదా ఇద్దరూ కూడా జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గోల్డ్ కలర్ దుస్తులు ధరించిన సదా మోస్ట్ స్టైలిష్ లుక్ లో మెస్మరైజ్ చేసే విధంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. సదా అసలు పేరు సదా మొహమ్మద్ సయ్యద్. ప్రేక్షకులకు అలవాటు పడ్డ పేరు సదా కావడంతో ఈమెను సదా అని పిలుస్తూ ఉన్నారు. నితిన్ తో కలిసి నటించిన జయం చిత్రం ఈమె కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అయ్యింది.ఈ క్రేజ్ తోనే ఈమె ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది. సదా తెలుగు, తమిళంలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. 2008 నుంచి సదా కెరియర్ నెమ్మదిగా డ్రాప్ అవుతూ వస్తుంది దీంతో పలు భాషలలో కూడా ఈమెకు ఆఫర్లు తగ్గాయి. తాజాగా గోల్డ్ కలర్ లెహంగాల వైట్ కలర్ టాప్ తో మైమరిపిస్తూ కనిపిస్తోంది సదా. తన అందాలను కప్పేస్తూ చాలా స్టైలిష్ లుక్కుల ఫోటోలకు ఫోజు ఇస్తూ కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అభిమానులు మాత్రం సదా అని సిల్వర్ స్క్రీన్ పైన చూడాలని తెగ ఆశపడుతున్నారు మరి అభిమానుల కోరిక మేరకు సదా రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటిస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: