సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కార్తి మరోవైపు సూర్య తమ్ముడుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో అతని యాక్టింగ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తెలుగులో కార్తికి ఇంతకీ గుర్తింపు వచ్చింది అంటే అది యుగానికి ఒక్కడు సినిమాతోనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఎంతగా కరెక్ట్ అయ్యారు అంటే ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే టీవీ లకి అతుక్కుపోయి ఈ సినిమాని చూస్తూ ఉంటారు. 

దాని అనంతరం తమిళ్లో కార్తీ నటించిన పయ్యా సినిమాని ఆవారా అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాతో కూడా కార్తీ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో తెలుగులో కార్తీకీ మంచి మార్కెట్ కూడా ఏర్పడింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో కార్తీక్ జోడిగా తమన్న నటించింది. ఇక వీరిద్దరూ జంటగా నటించిన ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ సినిమా 2010లో విడుదలైనప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాలోని పాటలను వింటూ ఉంటారు చాలామంది మ్యూజిక్ లవర్స్.

ఈ పాటను వింటూ చాలా ఎంజాయ్ చేస్తారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెలను తెరకెక్కించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు లింగుస్వామి డైరెక్టర్ అని కూడా అంటున్నారు. కానీ ఈ సినిమాలో హీరో మాత్రం కార్తీక్ కాదు అని తెలుస్తుంది. అయితే ఈసారి ఈ సినిమా సీక్వెల్లో హీరోగా ఆర్యను తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆర్య ఫుల్ జోష్ లో ఉన్నాడు. కెప్టెన్ కాఫీ విత్ కాదల్ సినిమాలో నటించాడు ఈయన. ప్రస్తుతం ఖాదర్ భాష ఎండ్రా ముత్తు రామలింగం అనే సినిమాలో చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: