‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ ఇమేజ్ ని అందుకున్న ప్రభాస్ ఆ ఇమేజ్ ని నిలుపుకోవడంలో తడబాటు పడుతున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘బాహుబలి’ తరువాత విడుదలైన ‘సాహో’ ‘రాథే శ్యామ్’ సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారినప్పటికీ ప్రభాస్ క్రేజ్ అతడి మార్కెట్ ఏమాత్రం చెక్కుచెదరలేదు.


దీనికితోడు ప్రభాస్ డేట్స్ ఇస్తే చాలు అతడితో సినిమాలు చేయడానికి ఎన్నో ప్రముఖ నిర్మాణ సంస్థలు క్యూ కడుతూ అతడికి 100 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వడానికి ఎందరో రెడీగా ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ హృతిక్ రోషన్ ప్రభాస్ లతో కలిపి తీయబోతున్న మల్టీ స్టారర్ లో ప్రభాస్ కు 150 కోట్లు పారితోషికం ఇస్తారు అని వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.


ఇది చాలదు అన్నట్లుగా ఇప్పుడు ఇండస్ట్రీలో మరొక గాసిప్ హడావిడి చేస్తోంది. ప్రభాస్ నాగ్ అశ్విన్ ల మూవీ రెండు భాగాలుగా వస్తుందని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. ఈసినిమాలు కాకుండా ప్రభాస్ లిస్టులో మారుతి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడ ఉన్నాయి అని అంటున్నారు. ఇన్ని సినిమాలకు డేట్స్ సద్దుబాటు చేయలేక ప్రభాస్ ఒక వారం రోజులు ఒక సినిమాకు పనిచేసి మళ్ళీ గ్యాప్ తీసుకుని మరొక సినిమాకు పని చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఒకవైపు యంగ్ హీరోలు అంతా ఒక సినిమా పూర్తి అయిన తరువాత మరొక సినిమాను చేస్తూ తమ సినిమాల పై పూర్తి దృష్టిని నిలుపుతూ ఉంటే ప్రభాస్ మాత్రం ఇలా అనేక సినిమాల షూటింగ్ ను ఒకేసారి సమాంతరంగా నడిపిస్తూ ఉండటంతో అతడి ఏకాగ్రత దెబ్బతిని సినిమా క్వాలిటీ విషయంలో తేడా వచ్చే ప్రమాదం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం టాప్ హీరోల తీరుకు భిన్నంగా అడుగులు వేస్తూ తన ప్రత్యేకతను కొనసాగిస్తున్నాడు అనుకోవాలి..
మరింత సమాచారం తెలుసుకోండి: