డిఫరెంట్ కథలతో తెరకెక్కే సినిమాలలో నటిస్తూ నటుడిగా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్న వారిలో ఒకరు అయినటు వంటి నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని తన కెరియర్ లో ఎక్కువ శాతం డిఫరెంట్ కథలతో తెరకెక్కిన మూవీ లలో హీరోగా నటించి ఇప్పటికే ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. అలాగే ఆ మూవీ లతో ఎన్నో విజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

ఇది ఇలా ఉంటే నాని పోయిన సంవత్సరం అంటే సుందరానికి అనే మూవీ లో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాని కొత్త దర్శకుడు అయినటు వంటి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న దసరా అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు ఒక పాటను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రెండవ పాటకు సంబంధించిన అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ పాటను ఏ తేదీన విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: