టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్స్టార్ గా  తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ప్రేక్షకులు మరియు సెలబ్రిటీలకు సైతం మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం. ఇంతలా గుర్తింపును తెచ్చుకున్న మహేష్ బాబు సినిమాలు వస్తున్నాయి అంటే చాలు ఆయన అభిమానులు పండగ చేసుకుంటారు.అయితే ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన పోకిరి సినిమా సక్సెస్ వెనుక గల కారణాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మరియు పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పోకిరి. ఇక ఈ సినిమా మహేష్ బాబుకి మాత్రమే కాకుండా పూరి జగన్నాథ్ కి కూడా మంచి హిట్ ని ఇచ్చింది అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఈ సినిమా కంటే ముందుగా మహేష్ బాబు చాక్లెట్ బాయ్ లాగా ఉండేవాడు.ఈ సినిమాతో మాస్ హీరోగా మారాడు మహేష్ బాబు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు మహేష్ బాబు.ఈ సినిమా అనంతరం వరస సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు.అప్పట్లో ఈ సినిమా దాదాపుగా 50 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. అప్పట్లో ఈ సినిమా వసుళ్ళు హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పడంలో కూడా ఇలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా  క్లైమాక్స్ మార్చకుపోయి ఉంటే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేదని.. ఈ సినిమా ఎడిటర్ మార్తాండ కె వెంకటేష్ అప్పట్లో చెప్పడం జరిగింది. దాంతో పూరి జగన్నాథ్ ఆలోచించి ఈ సినిమాలో పోలీస్ అనే ట్యూస్తో రివీల్ చేసి హైలెట్ చేయడం జరిగింది. దీనికంటే ముందు ఈ సినిమాకి వేరే క్లైమాక్స్ ను అనుకున్నారట. మార్తాండ్ వెంకటేష్ చెప్పడంతో పూరి ఈ సినిమాలో క్లైమాక్స్ ను మార్చడంతో ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకుందట. ముఖ్యంగా చెప్పాలి అంటే అప్పట్లో ఈ సినిమాలోని క్లైమాక్స్ ఏ సినిమాలో కూడా చూడని విధంగా ఉంది. మొత్తానికి అయితే ఈ సినిమా ఇంతలా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం కే వెంకటేష్ అని అందరూ అనుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: