ఎంతోకాలంగా చాలామంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్ బి కే ఎపిసోడ్ 1 పార్ట్ ఇటీవల విడుదలై ఎంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఓటిటి హిస్టరీ లోనే ఈ ఎపిసోడ్ కి ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టింది.కానీ ఈ మొదటి ఎపిసోడ్ లో చాలామంది అభిమానులు కోరుకున్న ప్రశ్నలు బాలయ్య అడగలేదుమ్ దీంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యారు చాలామంది. కానీ రెండో భాగం మాత్రం అభిమానులు కోరుకున్న రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. పాలిటిక్స్ గురించి బాలయ్య చాలా ప్రశ్నలను అడగబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పార్ట్ 2 కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

అభిమానులతో పాటు ఈ షోని చూసేందుకు ప్రేక్షకులు రాజకీయ నాయకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి కళ్ళు కాయలుగా చాలా ఎదురు చూస్తున్న ఈ ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ అయింది. అద్భుతమైన రెస్పాన్స్ ను కూడా అందుకుంది.అయితే ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో బాలయ్య పవన్ కళ్యాణ్ ని అడిగిన పలు ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే షో ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ ఒక ప్రశ్న అడగడం జరిగింది. అదేంటి అంటే నాకు మా నాన్నగారు అంటే దైవం ఆయన నుండి నేను చాలా నేర్చుకున్నాను అలా నాకు మా నాన్న అంటే దైవం నీకు మీ అన్నయ్య అంటే దైవం

ఆయన నుండి ఏం నేర్చుకున్నావు దాంతోపాటు ఏమీ వదిలేసావు అంటూ పవన్ కళ్యాణ్ ని అడిగాడు బాలకృష్ణ. దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్..చిన్నప్పటి నుండి మా అన్నయ్య దగ్గరే పెరిగాను ఆయన దగ్గర నేర్చుకున్నవి చాలా ఉన్నాయి.. మొదటగా ఆయన దగ్గర నుండి నేర్చుకున్నది కష్టపడే తత్వం.. అలాగే కుటుంబం మొత్తం ఎలా కలిసి ఉండాలి అనేది కూడా ఆయన దగ్గర నుండి చూసి నేర్చుకున్నాను.. ఆయన దగ్గర నుండి నేర్చుకున్నది మొహమాటం కూ..డా కానీ అదే రాజకీయాల్లో పనికిరాదు..కాబట్టి దానికి నేను దూరంగా ఉన్నాను.. అన్నయ్య చాలా మంచివాడు ఆ మంచితనం కూడా నాకు పెద్దగా నచ్చదు.. దానివల్ల ఆయన చాలా నష్టాలను చూశాడు.. అలాంటి వాటికి నేను దూరంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాన్. అయితే మొత్తంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి మంచితనం మొహమాటం వల్ల నష్టం చేకూరుతుందని చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: