
త్రివిక్రమ్ తమిళ సినిమా ‘వినోదయ సీతం’ మూవీని పవన్ కళ్యాణ్ తో సముద్రఖని దర్శకత్వంలో హారికా హాసినీ బ్యానర్ లో నిర్మించే విధంగా చాలకాలం క్రితమే ఒక ప్లాన్ తయారుచేసాడు. ఈమూవీలో పవన్ పక్కన మరొక కీలక పాత్రలో నటించడానికి సాయి ధరమ్ తేజ్ ను ఎంపిక చేసాడు అని అంటారు. ఈమూవీ షూటింగ్ ఎప్పుడు మొదలైతే అప్పుడు రెడీగా ఉండాలని త్రివిక్రమ్ తేజ్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు అని కూడ అంటారు.
తేజ్ తన యాక్సిడెంట్ నుండి తేరుకున్న తరువాత నటించిన ‘విరూపాక్ష’ మూవీ షూటింగ్ పూర్తి అయి ఆమూవీ సమ్మర్ రేస్ లో రాబోతోంది. ప్రస్తుతం తేజ్ తను తదుపరి నటించవలసిన సినిమాల విషయమై శ్రద్ధపెట్టి మరొక సినిమాను లైన్ లో పెడుతుంటే త్రివిక్రమ్ తేజ్ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్ పూర్తి అయ్యేవరకు మరొక సినిమా లైన్ లో పెట్టవద్దని అతడికి సలహాలు ఇచ్చాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి పవన్ పూర్తి చేయవలసిన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. మధ్యలో పవన్ రాజకీయ కార్యకలాపాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ ఎంత ఒత్తిడి చేసినా పవన్ ‘వినోదయ సీతం షూటింగ్ స్పాట్ కు ఎప్పుడు వస్తాడో అతడికే తెలియని పరిస్థితి అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ సలహాను పాటిస్తూ పవన్ తో చేయబోయే సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ మరొక సినిమాను చేయకుండా ఎంతకాలం తను చేయవలసిన సినిమాలను పెండింగ్ లో పెట్టుకుంటాడు అంటూ కొందరు గుసగుసలాడు కుంటున్నట్లు టాక్..