సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. చాలామంది హీరోలు తోటి హీరోయిన్స్ తో ప్రేమలో పడుతుంటారు. వారిలో కొంతమంది ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే.. మరి కొంత మంది మాత్రం ప్రేమించిన తర్వాత పెళ్ళికి నో చెబుతుంటారు. అయితే ఒకానొక సమయంలో వాళ్ల వ్యవహారాలన్నీ బయటపడుతుంటాయి. మన సీనియర్ హీరో జగపతిబాబు గారి విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరిగింది. ఆయన విషయంలో అప్పట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. జగపతిబాబు కెరీర్ ఆరంభంలో ఫ్యామిలీ హీరోగా ఎంతగా అలరించాడో తెలిసిందే. ఆయన కూడా ఇండ్రస్ట్రీ లోకి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది. 

ఈ క్రమంలోనే జగపతిబాబు అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన సౌందర్య తో చాలా క్లోజ్ గా ఉండేవారు. ఆమెతో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ చట్టాపట్టాలేసుకొని తిరుగుతుండేవాడు. ఆ సమయంలో సౌందర్యను జగపతిబాబు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ సౌందర్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ సమయంలో జగపతిబాబు గారు చాలా బాధపడ్డారని.. ఆ బాధతోనే ఆయన తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు అంటూ ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అటువంటి వార్తలపై స్పందించాడు మన జగ్గు భాయ్. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు సౌందర్య తో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ..' నిజానికి నాకు సౌందర్యకు ఎలాంటి లవ్ ఎఫైర్లు లేవు. అవన్నీ వాస్తవాలు కావు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. 

సౌందర్య వాళ్ళ అన్నయ్య కూడా నాకు చాలా క్లోజ్. వాళ్ళ అన్నయ్య ద్వారానే సౌందర్య నాకు క్లోజ్ అయింది. అంతే తప్ప మా ఇద్దరి మధ్య అంతకుమించి ఎలాంటి రిలేషన్షిప్ లేదు' అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం విలన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బాలయ్య లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన జగపతిబాబుకి ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మన పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో ఓ విలన్ గా నటిస్తున్నాడు జగపతిబాబు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కేవలం విలన్ రోల్స్ ఏ కాదు అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ అదరగొడుతున్నాడు ఈ సీనియర్ హీరో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: