టాలీవుడ్ క్రియేటివ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, మొదటి సినిమా ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ ని కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి సరి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక సబ్జెక్టుని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు.చెప్పడమే కాదు ఫస్ట్ మూవీతోనే రికార్డు స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.ఇక ఈ రోజు బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో రామ్ చరణ్, బుచ్చిబాబుకి తన బర్త్ డే విషెస్ ని తెలియజేసాడు. ఈ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే సుకుమార్ కి తగ్గ శిష్యుడు అనిపించుకున్న బుచ్చిబాబు, రెండవ సినిమా ఎన్టీఆర్ తో  చెయ్యడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేశాడు. ఇతర హీరోలు అలాగే ప్రొడ్యూసర్స్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు కానీ బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాను అని దాదాపు రెండేళ్ల పాటు ఎంతగానో ఎదురు చూశాడు.


అయితే ఎన్టీఆర్ ఇంకా కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 సినిమా అనుకున్న టైంకి స్టార్ట్ అయ్యి ఉంటే, బుచ్చిబాబు-ఎన్టీఆర్ సినిమా ఉండేది. ఎన్టీఆర్ 30 చాలా ఆలస్యం అవ్వడంతో ఇక బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో సినిమా చెయ్యలేకపోయాడు. అయితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు ఇప్పట్లో అవ్వదని సైలెంట్ గా రామ్ చరణ్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ కి చెప్పిన కథనే రామ్ చరణ్ కి తగ్గట్లు మార్పులు చేసి బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు.అయితే పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ని మిస్ అయినా రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి మరో పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు అంటే బుచ్చిబాబు.ఈమధ్యనే చరణ్-బుచ్చిబాబు మూవీ గ్రాండ్ గా అనౌన్స్ కూడా అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: