కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగులో కూడా ఆయన తన మార్కెట్ ను పెంచుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి తమిళంలో తెరకెక్కించిన చాలా సినిమాలను తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా పాపులారిటీ దక్కించుకున్న ధనుష్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాలు చేస్తూ మరింత మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా గతంలో రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు లభించిన ఈయన ఇప్పుడు మళ్లీ సార్ సినిమాతో తన రేంజ్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు.  ఈ క్రమంలోని మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికి వస్తే మొదటి రోజే రఘువరన్ బీటెక్ సినిమా చివరి వరకు రాబట్టిన కలెక్షన్లను ఒక్కరోజులోనే సార్ మూవీ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మించిన సార్ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన గ్రాండ్గా విడుదలయింది.. ఈ సార్ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది.

కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటిసారి తెలుగులో అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నారు ధనుష్.. ఈ సినిమా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో 415 కు పైగా థియేటర్లలో విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో రూ.6 కోట్ల మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలై..  విడుదలకు ముందు రోజు రూ.5.5 కోట్ల బిజినెస్ కూడా చేసింది ఈ సినిమా. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వాతి / సార్ సినిమా టార్గెట్ రూ.35 కోట్లుగా నమోదవడం గమనార్హం. మొదటి రోజే రూ.నాలుగు కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రఘువరన్ బీటెక్ చివరి రోజు కలెక్షన్స్ రికార్డులను బ్లాస్ట్ చేసింది అని నిర్మాత నాగ వంశీ స్పష్టం చేశారు.  మొత్తానికి అయితే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: