
అయితే ఈ మధ్య రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు జానీ సినిమా ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆ సినిమా ఎందుకు ప్లాప్ అయింది సార్ అని యాంకర్ అడిగిన ప్రశ్న కి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జానీ సినిమా అనేది చాలా మంచి స్టోరీ కానీ పవన్ కళ్యాణ్ ఆ సినిమా లో హీరో కాకుండా ఒక చిన్న హీరో ని పెట్టి తిస్తె బాగుండేది అప్పుడు జానీ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేది అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కి హీరో గా ఎందుకు సెట్ అవ్వలేదు అంటే అప్పటికే ఆయన క్రేజ్ తార స్థాయి లో ఉంది.కాబట్టి వేరే హీరో తో చేస్తే బాగుండేది అని చెప్తూ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చాలా బాగా చేసారు అని చెప్పారు.ఇక ఇది ఇలా ఉంటె పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు పాలిటిక్స్ లో ఉంటూనే ఇటు సినిమాలు చేస్తున్నారు.గత సంవత్సరం వచ్చిన బీమ్లా నాయక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తరహా లోనే రాబోయే సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుందాం.
ఏదేమైనా ఇటు రాజకీయంగా అటు సినిమా ఇండస్ట్రీ పరంగా మంచి విజయోత్సాహం తో దూసుకుపోతున్న పవర్ స్టార్ కి అంతా మంచే జరగాలి అని ఆయన అభిమానుల కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.