అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరోపక్క సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గానే సీతారామం సినిమాలో ఒక మంచి పాత్ర చేసి మెప్పించిన సుమంత్ లేటెస్ట్ రిలీజ్ ధనుష్ సార్ సినిమాలో కూడా కెమియో రోల్ లో మెప్పించారు. అసలు ఈ సినిమాలో సుమంత్ ఉన్నాడు అన్న విషయాన్ని రిలీజ్ వరకు బాగా దాచారు. సినిమాలో సుమంత్ ని చూసి ఆడియన్స్ సర్ ప్రైజ్ అయ్యారు.

సుమంత్ ఇలాంటి చిన్న పాత్ర చేయడం ఏంటి అని అనుకోకుండా సినిమాలో చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర చేయడం అక్కినేని ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఇక ఇదిలాఉంటే సుమంత్ ఇలా సైడ్ రోల్స్ చేసిన పాత్రలు ఉన్న సినిమాలు మంచి ఫలితాలు అందుకుంటున్నాయి. ఆల్రెడీ సీతారామం సూపర్ హిట్ కాగా.. సార్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ లెక్కన సుమంత్ చేస్తున్న ఈ స్పెషల్ రోల్స్ వల్ల సినిమాకౌ స్పెషల్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. సుమంత్ ఇక మీదట ఇలానే తను హీరోగా సినిమాలు చేస్తూనే స్పెషల్ రోల్స్ లో కూడా కొనసాగిస్తాడని చెప్పొచ్చు.

ధనుష్ సార్ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా విషయంలో ముందు నుంచి సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. అనుకున్నట్టుగానే సార్ సినిమా ఆడియన్స్ ని ముఖ్యంగా స్టూడెంట్స్ ని ఆకట్టుకుంది. సినిమా కేవలం తెలుగు వర్షన్ లోనే కాదు తమిళ వర్షన్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ధనుష్ సార్ ఆయన కెరీర్ లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. సినిమాలో హీరోయిన్ గా నటించిన సం యుక్త మీనన్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. జివి ప్రకాశ్ మ్యూజిక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: