నెపోటిజం అనే పదం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్లుగా కొనసాగుతున్న వారు బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారిని నెపోటిజంతో తొక్కేస్తూ ఉంటారు అని ఎంతోమంది బహిరంగంగా విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం తర్వాత నెపోటీసం మీద వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో ఇలా భారీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారసులే ఎక్కువగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో లెజెండరీ ఫిలిం మేకర్ గా కొనసాగిన మహేష్ బట్ నట వారసురాలిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఆలియాభట్.


 అయితే మహేష్ భట్ కు ఆలియా భట్ తో పాటు పూజ భట్ కూడా సంతానం అన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కూడా అక్క చెల్లెలు అయినప్పటికీ తల్లులు మాత్రం వేరు.  ఇక ఇద్దరి మధ్య 20 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం కూడా ఉంది. 17 ఏళ్ల వయసులోనే మహేష్ బట్ దర్శకత్వం వహించిన డాడీ అనే హిందీ సినిమాతో తన కూతురుని ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేశాడు. ఇక ఆ తర్వాత పూజ బట్ తండ్రి దర్శకత్వంలోనే కొన్ని సినిమాలు చేసింది. సంజయ్ దత్, జాకీశ్రాఫ్, షారుక్ ఖాన్, సన్నీడియోల్, మిథున్ చక్రవర్తి లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అయితే నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా దర్శకురాలిగా కూడా టాలెంట్ చూపించింది పూజ.



 ఇకపోతే ఇక ఇలా ఆలియా భట్ అక్క అయిన పూజ అటు తెలుగు సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా ఏదో కాదు బాయ్ ఫ్రెండ్. 1994లో ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్ర ఇచ్చింది పూజ. సాయి కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీహరి, నాజర్, మురళీమోహన్ కీలక పాత్రలో నటించారు అని చెప్పాలి. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు ఈ సినిమాను నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. పాటలు క్లిక్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇలా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా చివరికి డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ దెబ్బకి పూజ భట్ మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: