ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఇప్పటికే రానాతో కలిసి బీమ్లా నాయక్ అనే సినిమాలో నటించాడు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ముద్దుల మేనల్లుడుగా కొనసాగుతున్న సాయి ధరంతేజ్ తో కలిసి ఇక ఒక సినిమా చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ తెరమీదకి వచ్చిన అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంది.



 తమిళంలో సూపర్ హిట్ అయినా వినోదయ సీతం అనే సినిమాకి ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ గా రాబోతుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ సినిమాకు సముద్రాకిని దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే అందించేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ దృశ్య ఇక కొన్ని కమర్షియల్ హంగులను ఈ కథకు జోడించబోతున్నట్లు తెలుస్తోంది.



 ఇంతకీ ఇక తమిళంలో హిట్ అయిన వినోదాయ సీతం కథ ఏంటి అన్నది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఇక వివరాల్లోకి వెళితే.. జీవితంలో ఎన్నో కలలు కన్న ఒక వ్యక్తి కారు ప్రమాదంలో చనిపోతాడు. అయితే ఆయనను పైకి తీసుకు వెళ్లేందుకు ఒక దూత వస్తాడు. ఇలాంటి సమయంలోనే జీవితంలో ఎన్నో బాధ్యతలు మిగిలి ఉన్నాయి. దయచేసి అవి పూర్తి చేసేంతవరకు తనకు సమయం ఇవ్వండి అంటూ కోరడంతో అతని కోరికను మన్నించి మళ్లీ అతని ఆత్మను శరీరంలోకి ప్రవేశపెడతాడు ఆ దూత. ఇక ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి అన్నదే వినోదాయ సీతం కథ. అయితే ఇక ఈ కథను అటు త్రివిక్రమ్ తనదైన స్టైల్ లో మార్చేసాడు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: