ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒకే సినిమాకు సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అదేంటో కాదు పవన్ కళ్యాణ్ తన ముద్దుల మేనల్లుడు అయిన సాయి ధరంతేజ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడని. అది కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన వినోదాయసీత్తం అనే సినిమాకు తెలుగు రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అంతకుమించి ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు స్క్రీన్ ప్లే ఇవ్వబోతున్నాడు అన్న వార్త అభిమానులు అందరిని కూడా సంతోషంలో ముంచేస్తుంది అని చెప్పాలి.


 ఎందుకంటే త్రివిక్రమ్ డైలాగులు అంటే ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అంతకుమించి ఇక పవన్ కళ్యాణ్ కోసం స్వయంగా త్రివిక్రమ్ రంగంలోకి దిగి డైలాగులు రాస్తే ఇక అవి అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఇక ఇలా పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు సముద్రకిని దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త బయటకు వచ్చిన అది హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాలో ఒక మలయాళీ హీరోయిన్ నటించబోతుందట. ఆమె ఎవరో కాదు అందంగా కన్నుగీటి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్.


 గత కొంతకాలం నుంచి ఈ అమ్ముడు ఎన్నో సినిమాలు చేస్తున్న సరైన హిట్టు మాత్రం కొట్టలేక పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఈ అమ్మడికి ప్రస్తుతం బంపర్ ఆఫర్ వచ్చింది అన్నది తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం అయినా వినోదాయ సీతం రీమేక్లో ఛాన్స్ కొట్టేసిందట. ఇప్పటికే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ ఫిక్స్ అయింది. అయితే మరో కీలకపాత్రలో నటించడం కోసం ఒక అందమైన హీరోయిన్ అవసరమైందట. ఇక ఈ పాత్ర కోసమే ప్రియా ప్రకాష్ వారియర్ ను సెలెక్ట్ చేశారట. ఈ సినిమాతో అయినా ఈ మలయాళ బ్యూటీ కి  హిట్టు దక్కుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: