
మన్మధుడు 2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో నాగార్జున చేసిన రొమాంటిక్ సీన్స్ ని ఇప్పటికీ కూడా ప్రేక్షకులు మరిచిపోరు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం నాగార్జున ఎందుకో సరైన హిట్టు లేక వెనకబడి పోతున్నాడు.. తన సహచర హీరోలు అయినా చిరంజీవి, బాలయ్యలు మంచి కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంటే నాగార్జున మాత్రం హిట్టు కొట్టలేకపోతున్నాడు అని చెప్పాలి. అయితే చాలా రోజుల తర్వాత నాగార్జున మళ్లీ వింటేజ్ లుక్ ట్రై చేయబోతున్నాడట. నేను లోకల్, ధమాకా, సినిమా చూపిస్త మామ లాంటి సినిమాలకు రచయితగా వ్యవహరించిన ప్రసన్నకుమార్ బెజవాడ నాగార్జున సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది మలయాళ రీమేక్ అన్న వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. నాగార్జునతో కలిసి ఒక కొత్త హీరోయిన్ ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నదట. ఆ హీరోయిన్ నే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మిస్ ఇండియాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న హైదరాబాద్కు చెందిన మానస వారణాసి అనేది తెలుస్తుంది. తెలుగు సినిమాలలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆమె నాగార్జున సినిమాతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుందట. కాగా నాగార్జున వయసు ప్రస్తుతం 60 ఏళ్లకు పైగానే ఉండగా మానస వారణాసి వయసు మాత్రం 25 సంవత్సరాలు మాత్రమే ఉండడం గమనార్హం.