సినిమా ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్ అనేవి చాలా కామన్. ప్రేమించి పెళ్లి చేసుకున్న నటీనటులు ఉన్నారు. విడిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అంతెందుకు ఇద్దరికంటే ఎక్కువ మందితో ప్రేమలో పడ్డ సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హీరోలు ఎక్కువ మంది హీరోయిన్స్ తో లవ్ అఫైర్స్ నడుపుతూ ఉంటారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు జరిగేది ఇదే. సౌత్ ఇండియాలో చూసుకుంటే కోలీవుడ్ హీరో శింబు, సిద్ధార్థ్ అలాగే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ వంటి నటులు ఈ కోవకు చెందినవారే. ఇదిలా ఉంటే ప్రస్తుతం  హీరో శింబు కు సంబంధించి ఓ వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే త్వరలోనే శింబు పెళ్లి చేసుకోబోతున్నాడట. 

తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శింబు గత కొంతకాలంగా ఓ కోటీశ్వరురాలైన అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడట. శ్రీలంకకు చెందిన ఆ అమ్మాయి ప్రస్తుతం మెడిసిన్ చదువుతోందట. మన శింబుకు ఆమె పెద్ద ఫ్యాన్ అట. ఆమె తండ్రి కొన్ని వందల కోట్ల బిజినెస్ కి అధిపతి అని తెలుస్తోంది. ఇక ఇటీవల వీరి పెళ్లికి పెద్దలు సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. దీంతో అతి త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే హీరో శంభు కానీ లేదా వారి కుటుంబ సభ్యులు కానీ దీనిపై అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.

కాగా గతంలో శింబు చాలామంది హీరోయిన్స్ తో ప్రేమ వ్యవహారాలు నడిపాడు. మొదటగా కోలీవుడ్ హీరోయిన్ నయనతారను ప్రేమించాడు. చాలాకాలం ప్రేమలో ఉన్న వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత హన్సికతో ప్రేమలో పడ్డాడు. వీళ్లు కూడా కొన్నేళ్లపాటు చాలా ఘాటుగానే ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక అటు నయనతార ఇటు హన్సిక ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఎవరిదారు వాళ్ళు చూసుకున్నారు. కానీ శింబు మాత్రం ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా అతను ఇంటివాడైతే బాగుంటుందని కోరుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: