సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉన్నప్పటికీ కొంత మంది మాత్రమే తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నాను. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ రోజుల్లోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఈ యంగ్ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరోలుగా సాగర కే చంద్ర దర్శకత్వంలో రూపొందినటువంటి భీమ్లా నాయక్ మూవీ ద్వారా తెలుగు సిని పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో రానా కు భార్య పాత్రలో నటించిన సంయుక్త ఈ మూవీ లో తన నటన ద్వారా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా సంయుక్త ... వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరో గా రూపొందినటువంటి సార్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏక కాలంలో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయింది. 

తెలుగు లో ఈ సినిమా సార్ అనే పేరుతో విడుదల కాగా ... తమిళ్ లో వెత్తి అనే పేరుతో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా సంయుక్త తన సోషల్ మీడియా అకౌంట్ లో బ్లూ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ..m అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  ప్రస్తుతం సంయుక్త కు సంబంధించిన బ్లూ కలర్ సారీ లో ... బ్లూ కలర్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు నేటింట్లో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: